Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు వివరాలు ఇచ్చిన నటుడు విజయ్!

Actor Vijay Faces Scrutiny Over Discrepancies in Affidavits
Advertisement
  • పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ
  • క్రిమినల్ కేసులు, ఎన్నికల బ్యాంకు ఖాతాలకు సంబందించిన వివరాల్లో తేడా
  • న్యాయపరిశీలకు దారితీసే అవకాశం ఉందంటున్న నిపుణులు
Advertisement
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రెండుచోట్ల దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లలో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం న్యాయపరిశీలకు దారి తీసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల కోసం రూపొందించిన అఫిడవిట్‌లలో పెండింగ్ క్రిమినల్ కేసులు, ఎన్నికల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పెరంబూర్ ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్న విజయ్, తిరుచ్చి ఈస్ట్ కోసం సమర్పించిన అఫిడవిట్‌లో పెండింగ్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఒక బ్యాంకు ఖాతాను తెరిచామని, ఇందులో రూ.1 లక్ష ఉన్నట్లు పెరంబూర్ అఫిడవిట్లో పేర్కొన్న విజయ్, తిరుచ్చి అఫిడవిట్లో రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement
Vijay TVK
Vijay actor
Tamil Nadu elections
Perambur constituency
Tiruchy East constituency
election affidavit

More Telugu News